ఉద్యోగం బోర్‌ కొడుతోందా?

చేస్తున్న ఉద్యోగం బోర్‌ కొడుతోందని మరో ఉద్యోగం మారడం తప్పు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు కొంత సంయమనం పాటించక తప్పదు. మీ మానసిక భావనకు మూలాలను వెదికే ప్రయత్నం చేయండి. కారణం తెలుసుకోండి.
 
బహుశా బాస్‌తో మీకు పడటం లేదనో, కంపెనీ మీ శ్రమను గుర్తించలేదనో, ఆశించిన వేతన ఫలాలు అందడం లేదనో ఫిర్యాదులు మీకుంటే వాటిని కాసేపు పక్కన పెట్టి.. మీ వైపు నుంచి మిమ్మల్ని పరీక్షించుకోండి.
 
ఉద్యోగంలో చేరిన మొదట్లో చూపిన చొరవను ఇప్పుడు చూపిస్తున్నారా? బాధ్యతలను అందిపుచ్చుకుంటున్నారా? పనిని మరింత నైపుణ్యంగా, వైవిధ్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? పునరాలోచించుకునే సమయం వచ్చిందేమో అవలోకించండి. 
ఏ కంపెనీలో అయినా, ఏ ఉద్యోగంలో అయినా ప్రస్తుత సంస్థలో ఉన్నట్లే ఉంటుందన్న సంగతి మరిచిపోకండి. సమస్య ఏదైనా ఉందంటే అది మీలోనే ఉండి ఉండవచ్చు. ఆ దిశగా మీకు మీరే సద్విమర్శ చేసుకుంటే మంచిదేమో ఆలోచించండి.
 
రొటీన్‌కు భిన్నంగా ఆలోచించగలిగే తత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా ఉద్యోగం బోర్‌ కొట్టవచ్చు. కేవలం మీకు అప్పగించిన పనిని పనిగా కాకుండా వైవిధ్యభరితంగా చేస్తున్నారా లేదా సమీక్షించుకోండి.
 
అనుభవం గడించిన ఉద్యోగాన్ని కాదనుకుని, మరో రంగంలోకి షిప్ట్‌ కావాలనుకోవడం అన్నిసార్లు సరి కాదు. దేన్నయినా మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టడం, అందులో అవకాశాలను అందిపుచ్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
 
పై ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పుకున్నప్పుడు.. మీరు ఉద్యోగం మారక తప్పదన్న నిర్ణయానికి వచ్చారనుకోండి. అప్పుడు కంపెనీ కాకుండా కంపెనీలోని విభాగాలు మారడానికి కృషి చేయండి.
 
మీరు పనిచేస్తున్న ఫ్లాట్‌ఫాం నుంచి అనుబంధ ఫ్లాట్‌ఫాంలకు వెళ్లడం ఉత్తమం. కంపెనీ మారడం కంటే అవకాశం వచ్చినప్పుడు విభాగం మారడం తెలివైన పని. అయితే అందుకు తగిన నైపుణ్యాలు, అర్హతలను సమకూర్చుకోవడం మీ బాధ్యత. ముందస్తు ప్రణాళికతోనే ఇది సాధ్యం అవుతుంది. అంత సన్నద్ధత మీలో ఉన్నప్పుడు ఉద్యోగం మారొచ్చు.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

List of Cloud Certifications