Posts

Showing posts with the label యూనినార్

టెలినార్ (యునినార్) వినియోగదారులకు ఉచిత బీమ, శ్రీరామ్‌ లైఫ్‌తో భాగస్వామ్యం 

మొబైల్‌ సర్వీసుల రంగంలోని టెలినార్‌ కంపెనీ తమ కస్టమర్లకు ఉచిత బీమా స్కీమ్‌ను శ్రీరామ్‌ లైఫ్‌ భాగస్వామ్యంలో ప్రవేశపెట్టింది. దేశంలో ఒక మొబైల్‌ ఆపరేటర్‌ ఈ తరహా స్కీమ్‌ను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. యునినార్‌ కంపెనీ టెలినార్‌గా మారిన సమయంలోనే రెండు వారాల క్రితం ప్రారంభించిన ఈ స్కీమ్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించడంతో పాటు తొలి కస్టమర్‌కు ఐఆర్‌డిఏ చైర్మన్‌ టి.ఎస్‌.విజయన్‌ చేతుల మీదుగా పాలసీని అందించారు. ఈ స్కీమ్‌ కింద ఇప్పటికే లక్ష మంది కస్టమర్లు నమోదయ్యారని టెలినార్‌ ఇండియా సిఇఒ వివేక్‌సూద్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభం నుంచి తాము అల్పాదాయ వర్గాలకు చెందిన కస్టమర్లే టార్గెట్‌గా ప్లాన్‌లు ఆవిష్కరించామని, అలాగే అల్పాదాయ వర్గాలకు బీమా రక్షణ అందించడం ద్వారా వారికి సాధికారత అందిస్తున్న శ్రీరామ్‌ లైఫ్‌తో ఈ స్కీమ్‌లోని కస్టమర్లకు బీమా కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. ఈ స్కీమ్‌ ఎలా...? టెలినార్‌ సంస్థ తమ కస్టమర్లకు ఉచిత బీమా ప్రయోజనాన్ని అందిస్తోంది. టెలినార్‌లో కొత్త కస్టమర్‌గా చేరిన వారందరికీ సిమ్‌తో పాటుగా రెండు నెలల కాలానికి పది వేల రూపాయలకు ఉచిత బీమా కూడా అందుతుంది. ఇప్పటిక...