Posts

Showing posts with the label ఐటి కంపెనీ

ఎపిలో ఐటి కంపెనీల పెట్టుబడులు

Image
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలు మందుకొచ్చారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి శాఖ మం త్రి పల్లె రఘునాధ రెడ్డికి అంగీకార పత్రాలను అందజేశారు. అలాగే ఇల్లినాయిస్‌ కామర్స్‌, ఎకనామిక్స్‌కు చెందిన ప్రతినిధుల బృందంతో మం త్రి బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ను సిస్ట ర్‌ స్టేట్‌గా గుర్తిస్తున్నట్లు ఇల్లినాయిస్‌ కామర్స్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ బ్రెజ్లా ప్రకటించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఉన్నత స్థాయి కమిటీని పంపించి పరిస్థితులు అంచనా వేసిన అనంతరం పెట్టుబడులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎరిక్‌ తెలిపారు.