86 వేల కోట్ల పెట్టుబడికి ‘ఎస్సెల్’ సై

  • భారీ ప్రాజెక్టులతో సిద్ధమైన కంపెనీ
  • చిత్తూరులో సోలార్‌ పరికరాల తయారీ ప్లాంట్‌
  • భాగస్వామ్య సదస్సులో ఎంవోయూలు 
విశాఖపట్నం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త సుభాష్‌ చంద్ర యాజమాన్యంలోని ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా సిద్ధమైంది. చైనా కంపెనీ గోల్డెన్‌ కాంకర్డ్‌ హోల్డింగ్స్‌(జీసీఎల్‌) భాగస్వామ్యంలో కన్సార్షియం కింద ప్రాజెక్టులు చేపట్టనుంది. సుమారు రూ.86 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో రెండు ఎంఓయులపై సుభా్‌షచంద్రతో పాటు జీసీఎల్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ షు హువా సంతకాలు చేశారు. తమ కన్సార్షియం ఏపీలో సోలార్‌ పరికరాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందని సుభాష్‌ చంద్ర చెప్పారు. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్లాంట్‌లో సిలికా నుంచి సోలార్‌ ప్యానెల్స్‌ తయారుచేస్తారు. ఈ ప్లాంట్‌ చిత్తూరులోని తిరుపతి, శ్రీసిటీల మధ్య నిర్మించనున్నట్టు సుభా్‌షచంద్ర సూచనప్రాయంగా తెలిపారు. ఫలితంగా 15 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌ 
జీసీఎల్‌ భాగస్వామ్యంలోనే స్మార్ట్‌ ఇండస్ర్టియల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటుకు కూడా ఎస్సెల్‌ గ్రూప్‌ ఎంఓయు కుదుర్చుకుంది. ఇందులో భారత, చైనా దేశాలకు చెందిన కంపెనీలు భిన్న రకాల వస్తువుల తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రెండు వందల పరిశ్రమల ఏర్పాటుకు ఇందులో వసతి ఉంటుంది. 73 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఏపీ ప్రభుత్వం అనుమతులు ప్రకటించి భూములు కేటాయించగానే ఈ ఏడాది ముగిసేలోగానే ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పనులు చేపడతామని సుభా్‌షచంద్ర తెలిపారు.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty