మిస్టర్‌ ‘స్మార్ట్‌’లకు మైక్రోసాఫ్ట్‌ అండ

  • నూతన ఆవిష్కరణలకు టెక్నాలజీ మద్దతు 
  • జస్ట్‌ డయల్‌, పేటిఎం, స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం 
ముంబై : భారత స్మార్ట్‌సిటీలతో అనుసంధానమై ఉండి వాటి అభివద్ధికి పాటు పడాలన్న తపన గల వందలాది మంది ఔత్సాహిక పారిశ్రామికులకు ప్రాజెక్టుల అమలుకు కావలసిన ఆర్థిక, టెక్నాలజీ సహాయం సమకూర్చనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్ల చెప్పారు. ఇ కామర్స్‌తో సహా భిన్న విభాగాల్లో స్టార్ట్‌పల సంస్కృతి వేళ్లూనుకోవడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. ‘వేగవంతమైన భారత్‌-భవిష్య త్తు ఆవిష్కరణ’ అనే అంశంపై జరిగిన సదస్సులో కీలకోపన్యాసం ఇస్తూ జస్ట్‌ డయల్‌, పే టిఎం, స్నాప్‌డీల్‌ వంటి ఇ-కామ్‌ దిగ్గజాలతో మైక్రోసాఫ్ట్‌ కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకున్నదని ఆయన ప్రకటించారు. ఈ కొత్త భాగస్వామ్యాల కింద స్మార్ట్‌సిటీలతో అనుసంధానమై ఉన్న స్టార్ట్‌పలకు ప్రత్యేక క్లౌడ్‌ సదుపాయం అందిస్తుందని, తమ అగ్రగామి కంప్యూటింగ్‌ పరికరాలైన లూమియా 950, 950 ఎక్స్‌ఎల్‌, సర్ఫేస్‌ ప్రో 4 ఉత్పత్తులను కూ డా అందచేస్తుందని ఆయన చెప్పారు. 

డిసెంబర్‌, జనవరి నెలల్లో ఆ ఉత్పత్తులను అందచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 75 వేల రూపాయలు, అంతకన్నా పై ధరలో అందుబాటులో ఉంచనున్న సర్ఫేస్‌ ప్రో 4ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. స్మార్ట్‌సిటీలను సాధికారం చేయాలనుకునే వారికి తమ క్లౌడ్‌ సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నామని ఆయన చెప్పారు. ఒక బహుళజాతి సంస్థ భారత్‌లో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే ప్రథమం. స్మార్ట్‌సిటీలు, వ్యవసాయం, ఆరోగ్యసంరక్షణ, విద్యా రంగాలకు అవసరం అయిన సొల్యూషన్లు అభివృద్ధి చేసేందుకు జస్ట్‌ డయల్‌, పేటిఎం, స్నాప్‌ డీల్‌ భాగస్వామ్యంలో తాము కృషి చేయనున్నట్టు సత్య తెలిపారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, ప్రతి ఒక్క వ్యాపార సంస్థ, ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయి సామర్థ్యాలతో పని చేసేందుకు అవసరమైన సాధికారత తాము కల్పిస్తామని ఆయన చెప్పారు. వారికి అవసరమైన టెక్నాలజీ మద్దతును తమ సర్ఫేస్‌ ప్రో 4 అందిస్తుందని ఆయన చెప్పారు. తాను ప్రతి రోజూ ఐదు కిలోమీటర్లు పరుగెడతానని, ప్రతీ వారాంతంలో 10 పుస్తకాలు చదువుతానని ఆ తర్వాత విలేకరులకు నాదెళ్ల తెలిపారు. 12 మాసాల క్రితం తాము పూణె, ముంబై, చెన్నైలలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ గణనీయంగా పెరగడం తనకు ఆనందదాయకంగా ఉన్నదని ఆయన చెప్పారు. మైక్రోసా్‌ఫ్టకు ఆయా కంపెనీలను కొనుగోలు చేయాలని భావించడంలేదని, ఆయా పారిశ్రామికుల వినూత్న ఆవిష్కరణల్లోని నాణ్యతను మాత్రమే తాము చూస్తున్నామని ఆయన వివరించారు. 


పాస్‌వర్డ్‌ రహిత ప్రపంచం కోసం కృషి 
ఇమెయిల్స్‌, మొబైల్‌ఫోన్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాస్‌వర్డ్‌ రహిత ప్రపంచం ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు నాదెళ్ల చెప్పారు. ఉత్పాదకత, వ్యాపార ప్రాసెసింగ్‌లకు కొత్త రూపం ఇవ్వాలని తపన పడుతున్నామని, ఎవరైనా పని చేసేందుకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూర్చున్న చోటు నుంచే అన్నిపనులు చేయగల వ్యవస్థలను అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. సత్వరం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు, ఉత్పాదకత పెంపునకు నా యకత్వ స్థానాల్లో ఉన్న వారందరూ డిజిటల్‌ డివై్‌సలు ఉపయోగించాలని సూచించారు. 

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

List of Cloud Certifications