Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ!


న్యూఢిల్లీ: జపాన్‌లోని టొయోమా నగరంలోని వివిధ కట్టడాలు, పలు రంగాలకు చెందిన పరిశ్రమలను ఏపీలోనూ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం టొయోమా నగరానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల చంద్రబాబు జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఏపీ-టొయోమా సోదర రాష్ట్రాలుగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జపాన్‌ ప్రతినిధి బృందం చంద్రబాబుతో సమావేశమైంది. ఆ నగరంలో ఏమేమి ఉన్నాయో ఏపీలో వాటిని ఏర్పాటు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. అక్కడ ఏమేమి టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ! ఉన్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. టూరిజం, ఫార్మా సిటీలు, స్పెషల్‌ పర్పస్‌ మిషన్‌ల ఏర్పాటుకు వారు మొగ్గు చూపారు. వీటికి సంబంధించి జపాన్‌ బృందం గురువారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పర్యటిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి జపాన్‌ ప్రధానికి ఆ బృందం నివేదిక అందించనుంది. అనంతరం దీనిపై అక్కడి పార్లమెంటులో చర్చిస్తామని ఆ బృందం చంద్రబాబుకు తెలిపింది. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుసుకుంటామని హామీ ఇచ్చింది. త్వరలో జపాన్‌ ప్రధాని ఢిల్లీకి రానున్నారు. అప్పుడు దీనిపై ఏపీ ప్రభుత్వం జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుంది.
 
ఏపీలో బయోటెక్నాలజీ రంగంలో అవకాశాలు
ఏపీలో జీవ సాంకేతిక పరిజ్ఞాన రంగానికి సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌ రాఘవన్‌ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ మేరకు బుధవారం.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమక్షంలో ఆయన చంద్రబాబుకు బయోటెక్నాలజీ రంగంలో అవకాశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో బయోటెక్నాలజీ రంగం ఏ విధంగా ఉంది.. వాటికి, ఏపీకి వ్యత్యాసం వంటి అంశాలను సవివరంగా తెలిపినట్లు సమాచారం. కాగా, కార్యదర్శి విజయ్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

-ఆజ్యో 

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty