Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

సౌర కాంతి.. పవన శక్తి : ఆంధ్రప్రదేశ్‌లో 2018-19 నాటికి పది వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

2018-19 నాటికి పది వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి 

విజయవాడలో కుదిరిన రూ.19 వేల కోట్ల విలువైన ఒప్పందాలు 
పెట్టుబడులకు ఇదే తరుణం.. ఎగుమతులకూ అవకాశం: సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌లో 2018-19 నాటికి పది వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పత్తి సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన ఎస్‌బీ సోలార్‌ సర్వీసెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ, స్పెయిన్‌కు చెందిన సుజలాన్‌ ఎనర్జీ, అక్సియానా ఎనర్జీ కంపెనీలు రూ.19 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో గురువారం రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీల ప్రతినిధులు, నెడ్‌క్యాప్‌ ఎండీ కమలాకర్‌బాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విద్యుత్తు రంగంలో తాము చేపట్టిన సంస్కరణలకు కొనసాగింపుగా పర్యావరణానికి హాని కలిగించని సౌర, పవన విద్యుదుత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. దేశంలోనే తొలి సౌరపవన హైబ్రిడ్‌ విద్యుదుత్పత్తి యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు వివరించారు. దేశంలోనే విద్యుత్తు సంస్కరణలు ప్రారంభించింది తానేనని ఆయన గుర్తుచేశారు. తిరిగి తాను పాలనలోకి వచ్చేసరికి 22.5 మి.యూనిట్ల విద్యుత్తు లోటు ఉందని చెప్పారు. అధికారులు చేసిన కృషి వల్ల తిరిగి విద్యుత్తు మిగులు సాధించగలిగామన్నారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాలో నష్టాలను, వాణిజ్యపరమైన నష్టాలను 10.4 శాతానికి తగ్గించగలిగామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వీటిని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆరు శాతానికి తగ్గిస్తామన్నారు. విద్యుత్తు పంపిణీని మెరుగుపరిచేందుకు ఈ రంగంలో భవిష్యత్తులో రూ.21వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. హైబ్రిడ్‌ విద్యుదుత్పత్తి వల్ల భూవినియోగం తగ్గుతుందని, రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ప్లాంట్లను తాము ప్రోత్సహిస్తామన్నారు. మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

అమరావతిలో ఇంధన విశ్వవిద్యాలయం: ఇంధన రంగంలో మరిన్ని పరిశోధనల కోసం నూతన రాజధాని అమరావతిలో ఇంధన (ఎనర్జీ) విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సోలార్‌బ్యాటరీల విషయమై మరింత విస్తృత పరిశోధనలు సాగిస్తామన్నారు. సౌర విద్యుదుత్పత్తికి తొలి రోజుల్లో యూనిట్‌కు రూ.14 ఖర్చయ్యేదని, తరువాత ఇది రూ.6కు తగ్గిందని అన్నారు. ఈ ఖర్చు ఇంకా తగ్గి తలసరి విద్యుత్తు వినియోగం పెరిగేందుకు సౌరవిద్యుత్తు బ్యాటరీలపై పరిశోధించాలని సూచించారు. ఈ విశ్వవిద్యాలయానికి సుజలాన్‌ ఎనర్జీ కంపెనీ రూ.35 కోట్లు విరాళంగా ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు డిస్కంల నుంచి రూ.50 కోట్ల విరాళం వచ్చింది. ఈ మొత్తానికి సరిపోయేలా కేంద్రం కూడా మరో రూ.85 కోట్లు ఇచ్చేలా కృషి చేయాలని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి హర్షజోషిని ముఖ్యమంత్రి కోరారు.
ఎగుమతులకు అవకాశాలు: రాష్ట్రంలో మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడులకు సరైన సమయం ఇదేనని ముఖ్యమంత్రి అన్నారు. సముద్ర తీరం వెంట రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో విశాఖ, కాకినాడల్లో 23 మీటర్ల లోతైన ఓడరేవులు, కృష్ణపట్నంలో 21 మీటర్ల లోతైన ఓడరేవులు ఉన్నాయని వివరించారు. ఇక్కడి పరిస్థితులు తయారీరంగానికే కాకుండా ఎగుమతులకూ ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ఆరు వరుసల రహదారులు నిర్మిస్తున్నామన్నారు. అంతర్గత జలరవాణా మార్గాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైలు, వాయు రవాణాకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. రాయలసీమను తయారీ కేంద్రం (మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌)గా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని అమరావతిని ప్రపంచ ప్రసిద్ధి పొందిన పది నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఉపాధి అవకాశాలు: కేంద్ర ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శి వర్షజోషి మాట్లాడుతూ సౌర విద్యుదుత్పత్తితో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సోలార్‌ టెక్నీషియన్లుగా రాష్ట్రంలో తొలి విడత నాలుగు వేల మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సూర్యమిత్ర కింద అక్టోబరు 12 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన గోడపత్రికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఇవీ ఒప్పందాలు 

* జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు కంపెనీలకు చెందిన ఎస్‌బీ సోలార్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.18 వేల కోట్ల పెట్టుబడితో రెండు వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు, వేయి మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.


* స్పెయిన్‌కు చెందిన ఆక్సియానా ఎనర్జియా రూ.1400 కోట్ల పెట్టుబడితో 200 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టును కర్నూలులో నెలకొల్పేందుకు, రూ.150 కోట్లతో తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్‌) యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. సమావేశంలో ఇంధన, విద్యుత్తు శాఖల ఉన్నతాధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

(ఈనాడు వారి సౌజన్యంతో)

మరిన్ని చిత్రాలు 












Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty