Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

సెన్సెక్స్‌కు ఫెడరల్‌ కిక్‌

  • 565 పాయింట్ల ర్యాలీ.. నాలుగు సెషన్లలో 1169 పాయింట్లు అప్‌
ముంబై : సర్వత్రా ఉత్సాహపూరితమైన వాతావరణంలో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం పరుగులు తీసింది. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకు అమెరికాలో ఉద్యోగాల వృద్ధి నిరాశాపూరితంగా ఉన్నందు వల్ల వడ్డీ రేట్ల పెంపును అమెరికన్‌ ఫెడరల్‌ మరి కొంత కాలం వాయిదా వేస్తుందన్న వార్తలు మార్కెట్‌కు ఇంధనంగా నిలిచాయి. దీనికి తోడు మరిన్ని బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించడం, ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపా యి నిలదొక్కుకోవడం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలేవీ వెలువడకపోవడం వల్ల మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడింది. మొత్తం మీద సెన్సెక్స్‌ 564.70 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి 15 తర్వాత సెన్సెక్స్‌ ఒక సెషన్‌లో సాధించిన అతిపెద్ద ర్యాలీ ఇది. గత మంగళవారం ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించిన ఉత్సాహంలో సెన్సెక్స్‌ నాలుగు వరుస ట్రేడింగ్‌ సెషన్లలో 1168.71 పాయింట్ల ర్యాలీ సాధించింది. ఉదయం నుంచి పురోగమన పథంలోనే ట్రేడవుతూ వచ్చిన సెన్సెక్స్‌ ఒక దశలో 26,822.42 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి 564.60 పాయింట్ల నికరలాభంతో 26,822.42 పాయింట్ల వద్ద క్లోజయింది. ఆగస్టు 21వ తేదీ తర్వాత సెన్సెక్స్‌ నమోదు చేసిన గరిష్ఠ స్థాయి ఇదే. నిఫ్టీ 168.40 పాయింట్ల ర్యాలీతో 8119.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో నిఫ్టీ నమోదు చేసిన గరిష్ఠ ర్యాలీ ఇదే.
అమెరికా ఉద్యోగాల గణాంకాలు నీరసంగా ఉండడంతో అక్టోబర్‌లో అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీరేట్లు పెంచకపోవచ్చన్న సంకేతాలు మార్కెట్‌ను బలమైన ట్రాక్‌లో పెట్టాయని జియోజిత్‌ బిఎన్‌పి పారిబా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండమెంటల్‌ రీసె ర్చ్‌ విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. డిసెంబర్‌ వరకు అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్ల జోలికి పోవచ్చునన్న వార్తలు మార్కెట్‌ భాగస్వాముల్లో ఉత్సాహం నింపాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ హితేష్‌ అగర్వాల్‌ అన్నారు. దీనికి తోడు త్వరలో ప్రారంభం కానున్న ద్వితీయ త్రైమాసిక ఫలితాల సమయంలో కూడా కంపెనీలు ప్రోత్సాహకరమైన పనితీరునే ప్రకటించే అవకాశం ఉన్నదన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల పట్ల ఆసక్తిని పెంచాయని ఆయన వ్యాఖ్యానించారు. 

  • టాటా మోటార్స్‌ స్ర్కిప్‌ 8 శాతం లాభంతో మార్కెట్‌లో లాభపడిన షేర్లలో అగ్రస్థానంలో నిలిచింది. జాగ్వార్‌, లాండ్‌రోవర్‌ అమ్మకాలు పెరిగాయన్న వార్తలు ఈ స్ర్కిప్‌ను పరుగులు తీయించాయి. బిఎ్‌సఇలో ఈ స్ర్కిప్‌ 8.41 శాతం పెరిగి 322 రూపాయల వద్ద క్లోజయింది.
  • విజ్‌లెర్న్‌ టెక్నాలజీలో పూర్తి వాటాలను విక్రయించినట్టు ప్రకటించడంతో ఎడ్యుకాం షేరు గరిష్ఠంగా 12 శాతం లాభపడింది. ఈ షేరు బిఎ్‌సఇలో 11.85 శాతం లాభపడి 12.74 రూపాయలు, ఎన్‌ఎ్‌సఇలో 11.4 శాతం లాభపడి 12.70 రూపాయల వద్ద క్లోజయింది.
  • హెచ్‌డిఎ్‌ఫసి వారెంట్లు, నాన్‌ కన్వర్టిబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా పది వేల కోట్ల రూపాయలు సమీకరించడంతో ఈ షేరు ఐదు శాతం లాభపడింది. బి యెస్ ఈ 4.73 శాతం లాభంతో 1256 వద్ద క్లోజయింది.

రూ.1.84 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
సోమవారం సెన్సెక్స్‌ 565 పాయింట్ల ర్యాలీని సాధించడంతో ఇన్వెస్టర్ల సంపద 1.84 లక్షల కోట్ల రూపాయల మేరకు పెరిగింది. బిఎ్‌సఇలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం సంపద 1,84,664.63 కోట్ల రూపాయలు పెరిగి 98,39,357 కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 లాభాలతో ముగియగా టాటా మో టార్స్‌, టాటా స్టీల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, హిండాల్కో ఇండస్ర్టీస్‌ ముందువరుసలో నిలిచాయి. ఇంత ఉత్సాహవంతమైన వాతావరణంలో కూడా మారుతి, లూపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌ నష్టపోయాయి. సూచికలవారీగా చూస్తే యంత్రపరికరాల విభాగం గరిష్ఠంగా 3.28 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇన్‌ఫ్రా 3.04 శాతం, బ్యాంకెక్స్‌ 2.8 శాతం, మెటల్‌ 2.49 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో)

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty