Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

మొబైల్‌ డాటా క్లౌడ్‌లో సేఫ్‌

కాంటాక్ట్స్‌, ఫోటోస్‌, వీడియోస్‌, డాక్యుమెంట్స్‌... ఒక్కటేమిటి మొబైల్‌లో ఎన్నో ఫైల్స్‌. మరి ఆ డాటా భద్రంగా ఉండాలంటే! క్లౌడ్‌ స్టోరేజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఇందుకోసం క్లౌడ్‌ స్టోరేజ్‌ యాప్స్‌ను ఎంచుకుంటే చాలు. ఫైల్స్‌ను భద్రపరచుకోవడమే కాకుండా ఇతర డివైజ్‌ల్లో నుంచి యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఆ యాప్స్‌ విశేషాలు ఇవి... 

డ్రాప్‌బాక్స్‌ 
డ్రాప్‌బాక్స్‌ గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు. మొట్టమొదటి క్లౌడ్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని అందించిన యాప్‌ ఇది. ఉచితంగా 2 జిబి స్టోరే జి సదుపాయాన్ని అందిస్తుంది. అయితే ఇతర యూజర్స్‌కు రెఫర్‌ చేయడం, సోషల్‌ మీడియా ఫాలో కావడం...వంటివి చేస్తూ 20 జిబి వరకు ఉచితంగా స్టోరేజి ఫెసిలిటీ పొందవచ్చు. ఫోన్‌లో లేక టాబ్లెట్‌లో నుంచే ఆఫీస్‌ ఫైల్స్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అయ్యే విధంగా సెట్‌ చేసుకోవచ్చు. ఈమెయిల్‌ అటాచ్‌మెంట్‌ లేకుండా లార్జ్‌ఫైల్స్‌ను పంపుకోవచ్చు.

వన్‌డ్రైవ్‌
మైక్రోసాఫ్ట్‌ సంస్థ అందిస్తున్న యాప్‌ ఇది. వర్క్‌, పర్సనల్‌ లైఫ్‌కు ఒకే ప్లేస్‌లో పరిష్కారం చూపిస్తుంది. ‘వన్‌డ్రైవ్‌’ స్టోరేజ్‌ సమస్యలకు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్‌ యూజర్స్‌ అయితే కనుక వర్డ్‌, పవర్‌పాయింట్‌, ఎక్సెల్‌, ఇతర ఆఫీస్‌ యాప్స్‌తో సులభంగా అనుసంధానం కావచ్చు. వన్‌డ్రైవ్‌లోనూ పిక్చర్స్‌ అటో-బ్యాకప్‌ ఫీచర్‌ ఉంది. పిక్చర్స్‌ సెక్యూర్‌గా స్టోర్‌ అవుతాయి. ఇతరులు చూడటం సాధ్యం కాదు. 7 జిబి వరకు ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు. నెల నెలా డబ్బులు చెల్లిస్తే 1 టిబి వరకు స్టోర్‌ చేసుకోవచ్చు. అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ను ఇతర ఏదైనా డివైజ్‌లో నుంచి యాక్సెస్‌ చేసుకోవచ్చు. కెమెరా బ్యాక్‌పతోనే ఫోటోలు, వీడియోలు పర్సనల్‌ వన్‌డ్రైవ్‌ అకౌంట్‌లోకి అప్‌లోడ్‌ అయ్యే విధంగా పెట్టుకోవచ్చు. ఫైల్స్‌ని షేర్‌ చేసుకోవచ్చు. ఇందులోకి అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ను ఇతర యాప్స్‌లోనూ ఓపెన్‌ చేసుకోవచ్చు. కొత్త ఫోల్డర్లను క్రియేట్‌ చేసుకోవచ్చు.
గూగుల్‌ డ్రైవ్‌
గూగుల్‌ను ఉపయోగించని వారు ఎవరుంటారు. ప్రతి దానితో గూగుల్‌డ్రైవ్‌ ఇంటిగ్రేట్‌ అవుతుంది. 15 జిబి వరకు స్టోరేజ్‌ సదుపాయాన్ని అందిస్తోంది. జీమెయిల్‌కు 5 జిబి, డ్రైవ్‌కు 5 జిబి, ఫోటోలకు 5 జిబి వరకు అందిస్తోంది. అయితే ఈ స్పేస్‌ మొత్తం కలిపి ఒకే స్టోరేజ్‌ స్పేస్‌గా ఉంటుంది. నెలనెలా డబ్బులు చెల్లిస్తే 30టిబి వరకు ఆఫర్‌ ప్లాన్స్‌ పొందవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌ గూగుల్‌ డాక్స్‌ ఇంటిగ్రేషన్‌ సదుపాయాన్ని అందిస్తోంది. ఇది అదనం. ఉచితంగా అందించే 15 జిబి కోటాలోకి ఇది రాదు.
గూగుల్‌ ఫోటోస్‌
గూగుల్‌ డ్రైవ్‌తో పోల్చితే ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది. ఫోటోలు స్టోర్‌ చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించిన యాప్‌ ఇది. ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీతో అన్‌లిమిటెడ్‌ ఫోటోలను స్టోర్‌ చేసుకునే సదుపాయాన్ని గూగుల్‌ అందిస్తోంది. డివైజ్‌లో స్పేస్‌ సేవ్‌ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Best cloud storage services 2015/2016
కాపీ
ఇది కొత్త క్లౌడ్‌ స్టోరేజ్‌ ప్లాట్‌ఫామ్‌. ఇది క్రోమ్‌కా్‌స్టను సపోర్టు చేస్తుంది. బ్రౌజర్‌ సహాయంతో కాపీ అకౌంట్‌లోకి ఫైల్స్‌ను ప్లే చేసుకోచ్చు. ఫోటోలు ఆటోమెటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయి.
వెరిజన్‌ క్లౌడ్‌
కాంటాక్ట్స్‌, ఫోటోస్‌, వీడియోస్‌, మ్యూజిక్‌, డాక్యుమెంట్లు, టెక్ట్స్‌, మీడియా మెసేజ్‌లు, కాల్‌లాగ్స్‌... ఇలా అన్నింటినీ క్లౌడ్‌లోకి భద్రపరచుకోవడానికి వెరిజన్‌ క్లౌడ్‌ ఉపయోగపడుతుంది. స్టోర్‌ చేసుకున్న ఫైల్స్‌ పూర్తి సెక్యూర్డ్‌గా ఉంటాయి. 5 జిబి వరకు ఉచితంగా స్టోరేజ్‌ సదుపాయాన్ని పొందవచ్చు.
క్లౌడ్‌ బ్యాకప్‌
ఇందులో కూడా కాంటాక్ట్స్‌, ఫోటోస్‌, వీడియోస్‌, మ్యూజిక్‌, డాక్యుమెంట్లు, టెక్ట్స్‌, మీడియా మెసేజ్‌లు, కాల్‌లాగ్స్‌, ఇతర ఫైల్స్‌ను స్టోర్‌ చేసుకోవచ్చు. అడిషనల్‌గా 1 జిబి స్టోరేజ్‌ సదుపాయం లభిస్తుంది. అయితే 10 జిబి వరకు ఉచితంగా పొందే వీలుంది.
అమెజాన్‌ క్లౌడ్‌ డ్రైవ్‌
ఇందులో ఫోటోలు, వీడియో్‌సతో పాటు ఎలాంటి ఫైల్స్‌నైనా స్టోర్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్స్‌ అన్‌లిమిటెడ్‌ ఫోటో బ్యాకప్‌ పొందవచ్చు. మూడు నెలల పాటు ఫ్రీ ట్రయల్‌ను పొందవచ్చు.
మెగా వి2
50 జిబి వరకు ఉచితంగా స్టోరేజ్‌ సదుపాయం కావాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ఫోల్డర్స్‌ను, ఫైల్స్‌ను స్నేహితులతో, కాంటాక్ట్స్‌తో సులభంగా షేర్‌ చేసుకోవచ్చు. రియల్‌ టైమ్‌లో మార్పులు చేసుకోవచ్చు.
షుగర్‌సింక్‌
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఈమెయిల్‌ ద్వారా లింక్స్‌ సహాయంతో లార్జ్‌ ఫైల్స్‌ షేర్‌ చేసుకోవడానికి ఈ యాప్‌ ఉపకరిస్తుంది. మల్టిపుల్‌ ఫైల్స్‌ని ఒకేసారి అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇందులో 5 జిబి క్లౌజ్‌ స్టోరేజ్‌ ఉచితంగా లభిస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఎంటర్‌ప్రైజ్‌ యూజర్స్‌కు ఎక్కువగా ఉపయోగపడుతుంది. 50 జిబి వరకు ఉచితంగా స్టోరేజ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ యాప్స్‌ సైతం ఇంటిగ్రేట్‌ అవుతాయి. అయితే అప్‌లోడ్‌ చేసే ఫైల్‌ సైజ్‌ విషయంలో షరతులుంటాయి. 25 ఎంబీ కన్నా తక్కువ సైజ్‌ ఫైల్స్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేయడానికి సాధ్యమవుతుంది. మొబైల్‌ లేక టాబ్లెట్‌లో నుంచి ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌, వర్డ్‌, ఎక్సెల్‌, పీఎ్‌సడీ....ఇలా వందకు పైగా ఫైల్‌ టైప్స్‌ను చూసుకోవచ్చు. రీసెంట్‌గా చూసిన ఫైల్స్‌, ఎడిట్‌ చేసిన ఫైల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty