Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

జపాన్‌, ఎపి మధ్య మరో రెండు ఎంఒయులు పెట్టుబడులకు సాదర స్వాగతం: చంద్రబాబు

విజయవాడ: ‘‘నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. జపాన్‌ ప్రభుత్వం ఇందుకు ముందుకు వస్తోంది. నూతన రాజధానిని అభివృద్ధి చేయడానికి జపాన్‌ ప్రభుత్వంతో కలిసి మరో అడుగు ముందుకు వేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎపి ప్రభుత్వం గురువారం జపాన్‌ ఆర్థిక, పరిశ్రమల మంత్రిత్వశాఖ, అంతర్జాతీయ సహకార జపాన్‌ బ్యాంక్‌తో రెండు ఒప్పందాలు(ఎంఒయు) చేసుకుంది. సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ సింగపూర్‌, జపాన్‌ లు రెండూ ఏపీకి ఎంతో సహకరిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జపాన్‌ ప్రభుత్వం ఎపిలో పట్టణాభివృద్ధికి, ముఖ్యంగా అమరావతిని ప్రపంచ స్థాయి సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తోందన్నారు. బెంగుళూరు-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌, శ్రీకాకుళంలో సూపర్‌ పవర్‌ ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. జపాన్‌ మంత్రి యోషుకి తకగి మాట్లాడుతూ చంద్రబాబుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం తకగి, చంద్రబాబు పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. బ్యాంకు సహకారానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.వి.రమేశ్‌, జపాన్‌ సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరక్టర్‌ జనరల్‌ నోరికో నసు మధ్య పరస్పర ఒప్పందాలు జరిగాయి

ఒప్పందంలో ఏముంది... 
మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక టౌన్‌షిప్‌ల నిర్మాణం, ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌ఫోర్స్‌ సిస్టమ్‌ ఏర్పాటు, సమగ్ర ఇంధన నిర్వహణ సిస్టమ్‌ను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ సరిహద్దు ప్రాంతం, కృష్ణపట్నం పోర్టుల మధ్య చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు జసాన్‌ ప్రభుత్వం సహకరిస్తుంది.  కారిడార్‌కు ఎపి ప్రభుత్వం నిరంతరాయ విద్యుత్‌, నీటి వసతి, నిర్మాణాలు, విశాలమైన రోడ్లును సమకూరుస్తుంది. దీంతోపాటు సమాచార మార్పిడి, సహకారం, వివాదాల పరిష్కారంపై ఒప్పందం జరిగింది.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

List of Cloud Certifications

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty