ఈ యాప్‌.... మీ కోచ్‌

ఒంటిపై కేజీ కండలేని వాళ్లు సైతం కండరగండలు అవ్వాలని కలవరిస్తున్న రోజులివి. అయితే ఎంత ఫిట్‌నెస్‌పై మోజు ఉన్నా అందరికీ వ్యక్తిగత శిక్షకుడిని నియమించుకోవడం సాధ్యం కాదుగా! మరపుడు Freeletics యాప్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుంటే చాలు. ముందు చిన్న పరీక్ష పెడుతుంది. వయసు, బరువు, ఎత్తు, ఆడామగా? వివరాలడుగుతుంది. ఏ రకం వ్యాయామాలపై ఇష్టమో చెప్పమంటుంది. ఆఖర్న ఎన్నాళ్లు క్రమం తప్పకుండా కసరత్తులు చేయగలరో వాకబు చేస్తుంది. తర్వాత వీటన్నింటినీ విశ్లేషించి మీ శరీరతత్వానికి అనుగుణంగా ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెబుతుంది. ప్రెసప్స్‌, పులప్స్‌, స్క్వాట్స్‌, పుషప్స్‌, సిటప్స్‌, బర్పీస్‌.. ఏవైనా. ఎలా చేయాలో ఫొటోలు, వీడియాలు కూడా చూపిస్తుంది. డంబెల్స్‌లాంటి బరువులు ఎత్తకుండానే జిమ్‌తోపాటు ఇల్లు, ఆఫీసు, హోటల్‌.. ఎక్కడున్నా ఆ పరిసరాలకు తగ్గ వ్యాయామాలే చెబుతుంది. ఇప్పటికే అరవై లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మీరూ ప్రయత్నించండి.

Comments

Popular posts from this blog

Twenty Smart Business Buzzwords

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

List of Cloud Certifications