* మూడు సెంటర్ల నుంచి ప్రారంభం
ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్: ప్రఖ్యాత ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత్‌లోని మూడు సెంటర్ల నుంచి కమర్షియల్ క్లౌడ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇతర కంపెనీలు తమ సమాచారాన్ని క్లౌడ్ సర్వీస్ ద్వారా దాచుకునేందుకు మైక్రోసాఫ్ట్ సదుపాయం కల్పిస్తోంది. ముంబయి, పూణె, చెన్నై మూడు సెంటర్ల నుంచి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీని సందర్శించినప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భారత్‌లో క్లౌడ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సర్వీస్ కోసం మైక్రోసాఫ్ట్ 15బిలియన్ల అమెరికా డాలర్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.