Readers Choice
లాజిస్టిక్ హబ్, ఇండియా గేట్‌వేగా ఆంధ్రా..
- Get link
- X
- Other Apps
లాజిస్టిక్ హబ్, ఇండియా గేట్‌వేగా ఆంధ్రా.....గుంటూరులో ప్రాపర్టీ షోలో సిఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడిక్కడ అప్రెడా ప్రాపర్టీ షోను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్, ఇండియా గేట్‌వేగా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని అమరావతిని బ్లూ, గ్రీన్ రాజధానిగా అభివృద్ధి చేయటమే కాకుండా ఒక ప్రాంతాన్ని అప్రెడాకు కేటాయించి వారి ద్వారా నిర్మాణ పనులు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర విభజన అన్యాయంగా, ఏక పక్షంగా జరిగిందని, అయినా మానసికంగా ఆందోళనకు గురి కాలేదన్నారు. సంక్షోభాలు వస్తుంటాయి, పోతుంటాయని వాటిని అవకాశంగా తీసుకొని సమర్థవంతంగా ఎదగాలన్నారు. 15 నెలల్లోనే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో తాగు, సాగునీరు అందిస్తామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో పరిశ్రమల నిర్వహణకు ఆంధ్రా రెండో స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. సింగపూర్‌లోని లీక్వాతో ఎంవోయూ చేసుకున్నామని, ప్రపంచంలోనే ఐదు ఉన్నత దేశాల స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందన్నారు. 21 రోజుల్లో అన్ని వ్యాపారాలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. గుంటూరులో మెగా ఎగ్జిబిషన్‌కు స్థలం కేటాయిస్తామన్నారు. రాజధాని నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతుందని, భవిష్యత్తులో వచ్చే భూకంపాలు, తుఫాన్‌లను అమరావతిని 9 జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ఛత్తీ్‌సగడ్‌లోని జగదల్‌పూర్‌కు కలిపి మొత్తం 9 జాతీయ రహదారులను అనుసంధానంగా రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా సముద్ర తీరం వెంబడి 1954 కిలో మీటర్లు ఉందని, అందులో 13 పోర్ట్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో)
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment