Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

కొత్త ఫీచర్లను తీసుకొస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. తాజాగా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటిచింది. ఖాతాదారుల ప్రొఫైల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకునేందుకు ప్రొఫైల్ పిక్‌గా వీడియోనూ అప్‌లోడ్ చేసుకునే సొత్త ఫీచర్‌ను అందిస్తోంది.
మొబైల్ ఫ్రెండ్లీ అప్‌డేట్స్‌లో భాగంగా కల్పిస్తున్న ఈ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. దీంతో ఏడు సెకండ్ల వీడియోను జిఫ్(జీఐఎఫ్) ఫార్మాట్‌లోకి మార్చుకుని ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా రోజూ తాము ఏం చేస్తున్నదీ వీడియో రూపంలో ఫ్రొఫైల్ పిక్‌గా పెట్టుకునే వీలుంటుందని చెబుతున్నారు.దీన్ని ప్రస్తుతం యూకేలో పరీక్షించారు. త్వరలో అన్ని ప్రాంతాలకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.
దీంతో పాటు ప్రొఫైల్ డిజైన్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుట్లు ఫేస్‌బుక్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా తెలిపింది.
(ఈనాడు వారి సౌజన్యంతో)
Comments
Post a Comment