Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సమాచారాన్ని ఐఫోన్‌లోకి పంపించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా..? అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తాజాగా యాపిల్ సంస్థ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి యాపిల్ ఐఫోన్.. ఐపాడ్‌ల్లోకి ఏదైనా సమాచారం మార్పిడి చేసుకునే సదుపాయం ఇదివరకు లేదు. అయితే.. ఈ సమస్యకు పరిష్కారంగా యాపిల్.. ‘మూవ్ టూ ఐఓఎస్’ పేరుతో తొలి ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన ‘ఐఓఎస్9’ ఆపరేటింగ్ సిస్టంతో పాటు.. ఈ ఉచిత యాప్‌ను తీసుకొచ్చింది.
ఈ యాప్‌తో ఆండ్రాయిడ్ డివైజ్‌ల నుంచి ఏ సమాచారమయినా.. సులభంగా యాపిల్ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం కల్పించింది. దీంతో ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు మారే వారికి.. ఇతరుల నుంచి సమాచారాన్ని పంపించుకోవడంలో ఇక ఎలాంటి ఇబ్బందులండవని చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా ఫోన్‌నెంబర్లు. మెసేజ్‌లు.. ఫోటోలు.. బుక్‌మార్క్‌లతో పాటు ఏ ఫైళ్లనయినా.. ఐఓఎస్ డివైజ్‌లోకి సులభంగా పంపించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
Comments
Post a Comment