అమెరికాలో మొత్తం 4500 పైగా యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో చేరే విద్యార్థులు ముందుగా పరిశోధన చేసి ప్రామాణికమైన యూనివర్సిటీలను ఎంచుకోవాలి. అంతేకాదు చదువుకోవడానికి అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థులు వీసా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించ వద్దని చెబుతున్నారు ఎడ్యుకేషన యూఎ్‌సఏ నేషనల్ కో-ఆర్డినేటర్ రేణుక రాజారావు. హైదరాబాద్‌లోని రీజనల్ కో- ఆర్డినేటర్ పియా బహదూర్‌తో కలిసి హైదరాబాద్ బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలోని ‘అమెరికన్ కార్నర్’లో గురువారం విలేకరులతో మాట్లాడారు.
భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగువాళ్ళు నెల రోజులుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు. ఉద్యోగం చేస్తూ చదువుకోవడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. ఉద్యోగాలు చేసినా దాని ద్వారా వచ్చే డబ్బు ఫీజులు, వసతులకు అయ్యే ఖర్చులకు సరిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి వారాని కి అత్యధికంగా 20 గంటలు పని చేయడానికి అనుమతి ఉంటుంది. అందరికీ 20 గంటల అనుమతి దొరకదు. అదీ యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ పనులకు పెద్దగా ఆదాయం ఉండదు. అందుకే విద్యార్థులు ఈ భావం నుంచి బయటపడాలన్నారు.
అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముఖ్యంగా ఐదు అంచెలు పాటించాలని రేణుక రాజారావు చెప్పారు. మొదట విశ్వవిద్యాలయం, కోర్సులకు సంబంధించి పరిశోధన చేయాలన్నారు. యూనివర్సిటీల ప్రమాణాలు తెలుసుకోవాలి, తరవాత తను అనుకున్న కోర్సుకు సంబంధించిన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రెండో అంచెలో ఆర్థిక అంశాలను చూసుకోవాలి. ఫీజు, నివాసం, భోజనం, ఇతర ఖర్చులను అంచనావేసుకుని అందుకు తగినట్లుగా బడ్జెట్ రూపొందించు కోవాలని తెలిపారు. మూడో అంచెలో దరఖాస్తు విధానాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ అప్లికేషన్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్సస్, రికమండేషన్ లెటర్స్ తదితరాలు, నాలుగోది స్టూడెంట్ వీసా, ఐదోది ప్రిపరేషన్లు అంటే వెళ్లడానికి అనుగుణంగా సిద్ధం కావడం. ఇవి సరిగ్గా చూసుకున్న విద్యార్థులకు ఇబ్బందులు రావన్నారు. అమెరికాకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు సహాయం చేయడానికి యూఎస్ఐఈఫ్(యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్) ఉంది. వీటి బ్రాంచలు ఢిల్లీ, ముంబాయి, కోల్‌కత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఉన్నాయన్నారు. ఈ యూఎ్‌సఐఈఫ్ వెబ్‌సైట్‌లోకానీ, ఎడ్యుకేషన్ యూఎస్ఏ వెబ్‌సైట్‌లో కాని వెళితే వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు. 18001031231 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసినా వివరాలు లభిస్తాయన్నారు. వీటి సహాయంతో కాలేజీలు ఎం చుకోవాలి కానీ కన్సల్టెంట్లపై ఆధారపడొద్దని సూచించారు.
విద్యార్థుల సహాయంలో తెలుగు సంఘాలు
వీసా అంటే అధికార పత్రం కాదు. వీసాతో తమ దేశం వచ్చిన వ్యక్తులకు సంబంధించిన వివరాలు లేదా విషయాల్లో అనుమానం వస్తే వారిని విమానాశ్రయం నుంచే కస్టమ్స్ అండ్ బోర్డల్ ప్రొటెక్షన్ అధికారులకు తిప్పి పంపే అధికారం ఉంటుంది. అందుకే ఇమ్మిగ్రేషన్ తదితర విషయాల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను ఆదుకునేందుకు అమెరికా తెలుగు సంఘాలు ముందుకు వస్తున్నాయి. ఈ సంఘాలు అక్కడ అమెరికాలోనూ, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మొదలైన వాటిపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం తానా, అటా, నాట్స్, నాటా తదితర సంస్థలు ఈ పనిలో ఉన్నాయి. అమెరికా చదువు, జీవనానికి అవసరమైన విషయాలన్నింటినీ తమ సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ వేమనలు తెలిపారు. ఏమైనా సహాయం కావాల్సినవారు తానాను సంపద్రిస్తే సహాయ సహకారాలు అందిస్తామన్నారు. యూనివర్సిటీలు, ఇమ్మిగ్రేషన విధానాలపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు నాటా అధ్యక్షుడు మోహన మల్లం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన కాలేజీలు, యూనివర్సిటీల్లో తమ ప్రతినిధులు పర్యటించి అమెరికా అధికారులు అడిగే ప్రశ్నలు, అక్కడి యూనివర్సిటీలకు సంబంధించిన విషయాలపై చర్చా వేదికలు నిర్వహించనున్నట్లు నాట్స్ ప్రతినిధి మోహన కృష్ణ తెలిపారు. ఆన్‌లైన్ వేదికనూ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో ఎక్కువ మంది తెలుగు వారు చదువుకుంటున్నారు. ట్రైవాలీ లాంటి సమస్యలు అక్కడి వారికి ఎదురుకాకుండా ఉండడానికి తమవంతు సహాయం చేస్తున్నట్లు అక్కడి తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ ఫోరం తరపున కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నట్లు ఫోరం ప్రెసిడెంట్ విశ్వేశ్వరరావు కల్వల చెప్పారు. ఎయిర్‌పోర్టులో అధికారుల ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినప్పటికీ వెనక్కి పంపినట్లు మాకు తెలియపరిస్తే దానిపై చట్టపరంగా మేము మీకు సహాయం చేస్తామని ఇమ్మిగ్రేషన్ అటార్నీ ప్రముఖురాలు జనితా రెడ్డి తెలిపారు.
ఉపయోగపడే కొన్ని వెబ్‌సైట్లు
EducationUSA
:: Welcome to USIEF ::
College Information - Peterson's - The Real Guide to Colleges and Universities
eduPASS: The SmartStudent Guide to Studying in the USA
Carnegie Classifications | Home Page
The Center for Measuring University Performance
College Navigator - National Center for Education Statistics
Home | U.S. Department of Education
Council for Higher Education Accreditation Home Page
International Scholarships | Funding for US Study
FinAid! Financial Aid, College Scholarships and Student Loans
GRE
GMAC - Graduate Management Admission Council®
TOEFL: Home
IELTS - International English Language Testing System| Home
PTE Academic - The English test that takes you places
New Delhi, India - Embassy of the United States
Apply for a U.S. Visa | Home - India (English)
Comments
Post a Comment