పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్-చెన్నై కారిడార్
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): వైజాగ్-చెన్నై ఇండసి్ట్రయల్ కారిడార్‌తో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారిపోతాయని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) ఇండియా కంట్రీ డైరెక్టర్ టెరెసా కో అన్నారు. సోమవారంనాడిక్కడ సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో ఈ కారిడార్ అత్యంత కీలకంగా ఉండనుందని తెలిపారు. 85 కోట్ల డాలర్ల (సుమారు 6,000 కోట్ల రూపాయలు) విలువైన వైజాగ్- చెన్నై ఇండసి్ట్రయల్ కారి డార్.. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు గల ఆంధ్రప్రదేశ్ తీర ముఖ చిత్రాన్ని మార్చివేయనుందని అన్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌లో ఉన్న జిల్లాల స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) కేవలం 2 లక్షల రూపాయలుగా ఉందని, కారిడార్ కార్య రూపం దాలిస్తే 2035 నాటికి వీటి జిడిపి ఏకంగా 11,60,000 రూపాయలకు చేరుకుంటుందని ఆమె వివరించారు. అంతే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగు తాయని థెరీసా పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ కారిడార్‌లోని జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకత సామర్థ్యం ఏకంగా ఏడు రెట్లు వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కారిడార్ ద్వారా అదనంగా 29 లక్షల ఉద్యోగాల కల్పన అందుబాటులోకి రావటమే కాకుండా 2045 నాటికి ఇది ఏకంగా 1.4 కోట్లకు చేరుకుంటుందని ఆమె తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా..
వైజాగ్-చెన్నై కారిడార్‌లోకి ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, కెమికల్, పెట్రో కెమికల్, ఫార్మా, మెటలర్జీ, ఎలకా్ట్రనిక్, ఆటో రంగాలకు చెందిన పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని టెరెసా కో తెలిపారు. తీర ప్రాంతం లేకుండా ఉండే జిఎస్‌డిపి కంటే.. పారిశ్రామిక ఉత్పత్తులతో కూడిన కోస్టల్ కారిడార్‌లో జిఎస్‌డిపి 2.5 రెట్ల కన్నా ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా కోస్టల్ కారిడార్‌తో రాష్ట్ర వ్యాపార ముఖ చిత్రమే సమూలంగా మారనుందని అన్నారు. 2045 నాటికి పారిశ్రామికోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అన్నారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నోడ్స్..
వైజాగ్-చెన్నై ఇండసి్ట్రయల్ కారిడార్‌లో భాగంగా నాలుగు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నోడ్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అభి వృద్ధి చేయనున్నట్లు టెరెసా కో వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఈ కారిడార్ అత్యంత కీలకంగా ఉండనుందని అన్నారు. వచ్చే ముప్పై ఏళ్లలో ఈ కారిడార్ 1.1 కోటి ఉద్యోగాలను కల్పించే సత్తాను కలిగి ఉందన్నారు. 900 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో.. వైజాగ్-కాకినాడ, గంగవరం-కంకిపాడు, యేర్పే డు- శ్రీకాళహస్తిల మధ్య ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నోడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ నోడ్స్.. రాషా్ట్రభివృద్దికి చోదక శక్తులుగా ఉంటాయని అన్నారు.
పట్టణీకరణే కీలకం..
పారిశ్రామికాభివృద్ధి ఊపందుకోవాలంటే పట్టణీకరణ ఎంతో కీలకమని కొహో తెలిపారు. ఇండసీ్ట్ర కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాలతో పాటు అర్బనైజేషన్ (పట్టణీకరణ) చాలా ముఖ్యమైనదని, ఈ మూడు ఉంటే పారిశ్రామిక ముఖ చిత్రం సమూలంగా మారుతుందని అన్నారు. వైజాగ్- చెన్నై కారిడార్‌తో విశాఖ పట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు అత్యంత వేగంగా వృద్ధి బాట పట్టడమే కాకుండా ఉపాధి అవకాశాలు భారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
62.5 కోట్ల డాలర్ల రుణం..
వైజాగ్- చెన్నై కారిడార్‌కు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) 62.5 కోట్ల డాలర్ల రుణాన్ని అందించనుందని థెరీసా కొహో తెలిపారు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 85 కోట్ల డాలర్లు. ఇందులో 2.15 కోట్ల డాలర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. ఎడిబి పెట్టుబడులు పెట్టనున్న మొత్తంలో 1.25 కోట్ల డాలర్లను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కారిడార్ డెవలప్‌మెంట్, నైపుణ్య శిక్షణ సహా మరికొన్ని కార్యక్రమాలకు వెచ్చించనుంది.
ఏయే జిల్లాల్లో ఏ పరిశ్రమలు...
వైజాగ్-చెన్నై కారిడార్‌లో భాగంగా కృష్ణా జిల్లాలో ఆటోమొబైల్, టెక్స్‌టైల్స్, అపారెల్స్, స్టీల్ సిమెంట్. గుంటూరు జిల్లాలో.. టెక్స్‌టైల్స్, కెమికల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్. కడప జిల్లాలో.. ఫుడ్ ప్రాసెసింగ్, మెటలర్జీ, టెక్స్‌టైల్స్. చిత్తూరు జిల్లాలో.. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్, కెమికల్స్. విశాఖపట్నం జిల్లాలో.. పెట్రోలియం, స్టీల్, ఫెర్టిలైజర్, విద్యుత, మినరల్స్, ఇంజనీరింగ్, ఫార్మా. తూర్పు గోదావరి జిల్లాలో ఫెర్టిలైజర్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, విద్యుత, ఐరన్ అండ్ స్టీల్, గ్రాఫైట్, సిరామిక్. నెల్లూరు జిల్లాలో.. ఫుడ్ ప్రాసెసింగ్, మెటలర్జీ, లెదర్, టెక్స్‌టైల్స్ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఎడిబి ఇండియా వెల్లడించింది.
Comments
Post a Comment